Iphone 16 Launch: నేడే iPhone 16 లాంచ్ ..రాత్రి 10.30 గంటలకు గ్రాండ్ ఈవెంట్..లైవ్ ఎక్కడ చూడాలంటే?

Apple Event 2024: ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈ వెంట్ ఈరోజు  రాత్రి 10:00 కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జరిగే 'గ్లోటైమ్' ఈవెంట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటిలాగే ఆపిల్ ఐఫోన్ నుంచి నాలుగు కొత్త  మోడల్‌లను ప్రకటించింది. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. అన్ని iPhone 16 మోడల్‌లు కంపెనీ స్వంత AI ప్లాట్‌ఫారమ్ అయిన Apple ఇంటిలిజెన్స్‌ ఇందులో ఉండే అవకాశం ఉంటుంది.  

Written by - Bhoomi | Last Updated : Sep 9, 2024, 04:02 PM IST
Iphone 16 Launch: నేడే iPhone 16 లాంచ్ ..రాత్రి 10.30 గంటలకు గ్రాండ్ ఈవెంట్..లైవ్ ఎక్కడ చూడాలంటే?

 

Apple Event 2024: ఐఫోన్ ప్రియులు ఎన్నాళ్లుగానో వేచిన సందర్భం ఈ రోజు సాక్షాత్కారం కాబోతోంది. ఐఫోన్ 16 విడుదలకు వేదిక కానున్న ఆపిల్ ఈవెంట్ నేడు సెప్టెంబర్ 9వ తేదీ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు షురూ కానుంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ తో పాటు పలు ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులను ఆపిల్ సంస్థ లాంచ్ చేయనుంది. ఈవెంట్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈవెంట్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 12వ తేదీన కాలిఫోర్నియా వేదికగా ఈ ఈవెంట్ ను నిర్వహించారు. అంతకుముందు సంవత్సరం కూడా సెప్టెంబర్ 7వ తేదీన ఆపిల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం సెప్టెంబర్ 10వ తేదీన ఆపిల్ ఈవెంట్ నిర్వహిస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

ఈవెంట్ ట్యాగ్ లైన్ ఇట్స్ గ్లో టైం అంటూ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈవెంట్ సాక్షిగా ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అలాగే ఆపిల్ వాచ్ ఎయిర్ పార్ట్స్ దీంతోపాటు సరికొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కూడా ప్రవేశపెట్టనుంది. కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 16 సిరీస్ లో ఆపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే టెక్నాలజీ అన్ని కంపెనీలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఆపిల్ సృష్టిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.

Also Read:  Business Ideas: మహిళలకు లక్కీ ఛాన్స్ ..ఇల్లు కదలకుండా రోజుకు 5000 రూపాయలు సంపాదించే  బిజినెస్ ఐడియా  

నేడు జరిగే ఈవెంట్ కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చూసేందుకు యూట్యూబ్లో స్ట్రీమింగ్ జరగనుంది. ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ సంబంధించి మొత్తం నాలుగు మోడల్స్ విడుదల చేయనున్నారు. వీటిలో ఐఫోన్ 60 ఐఫోన్ ప్లస్ 16 ప్రో మాక్స్ ఫోన్లు విడుదల కానున్నాయి.

ఐఫోన్ 16 ప్రత్యేకత గురించి తెలుసుకుందాం:

ఈసారి ఐఫోన్ 16 లైనప్ లో మొత్తం నాలుగు మోడల్స్ విడుదల కానున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏ 18 ప్రో చిప్ సెట్ అమర్చి ఉంటుంది. దీని వల్ల మీ ఫోన్ అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్ కెమెరా సిస్టం విషయానికొస్తే 2 X ఆప్టికల్ జూమ్ తో 48 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ తో పని చేయనుంది.

ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ ప్రత్యేకంగా గేమింగ్ స్ట్రీమింగ్ కోసం రూపొందించారు. ఇక ఐఫోన్ 16 ప్రో మాక్స్ కోసం ప్రత్యేకంగా అల్ట్రా వైల్డ్ లెన్స్ 12 మెగా పిక్సెల్ నుంచి 48 మెగా పిక్సెల్ వరకు పెంచారు. దీంతో ఫోటో క్వాలిటీ అనేది పెరిగింది. ఇక బ్యాటరీ లైఫ్ లో కూడా ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రత్యేకంగా ఉండనుంది.

మీరు Apple  అధికారిక వెబ్‌సైట్, YouTube ఛానెల్, Apple TV యాప్ ద్వారా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. యాపిల్ ప్రపంచ ప్రేక్షకుల కోసం మొత్తం ప్రెజెంటేషన్‌ను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

Also Read: ITR Tax Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా.. ఇంకా ట్యాక్స్  రిఫండ్ కాలేదా? అయితే స్టేటస్ చెక్ చేసుకోండిలా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News