Bumper Discount On Iphone 14: యాపిల్ ఫోన్ అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. కానీ ధర అధికంగా ఉండడం వల్ల కొనలేకపోతారు. అయితే ఇలాంటి వారి కోసం మేము ఈ రోజు సరికొత్త డీల్ పరిచయం చేయబోతున్నాం. బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్టులో యాపిల్ స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ డీల్ భాగంగా యాపిల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 11 శాతం తగ్గింపు లభింస్తుంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్ కోసం బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచింది ఫ్లిప్‌కార్ట్..ముఖ్యంగా APPLE iPhone 14 కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే 13 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ కంపెనీ మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,900లో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్లిప్‌కార్టులో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ 14 రూ. 68,999లకే లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ కార్డుతోనే EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే అదనంగా మరో 15 శాతం తగ్గింపు లభించబోతోంది. అన్ని డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 2,250 తగ్గింపు లభిస్తుంది. యాపిల్ 14ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారి కోసం ఫ్లిప్ కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మీరు ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగిస్తే రూ. 35,600 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తోంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఎక్చేంజ్ బోనస్ మీ పాత స్మార్ట్ ఫోన్‌పై అధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 35,600 తగ్గింపు పొందడానికి మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తేనే ఇంత తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ యాపిల్ 14 అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 33,399లకే పొందవచ్చు. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల ఇంక తగ్గింపు లభిస్తుంది.
APPLE iPhone 14 ఫీచర్స్:
6.1 అంగుళాలు డిస్ ప్లే
సూపర్ రెటినా XDR OLED
డాల్బీ విజన్ సపోర్ట్
Apple A15 బయోనిక్ (5 nm) చిప్‌సెట్
iOS 16, iOS 16.5కి అప్‌గ్రేడబుల్ OS
12 MP డ్యూయల్ కెమెరా
12 MP అల్ట్రావైడ్ కెమెరా
LED డ్యూయల్ టోన్ ఫ్లాష్
12 MP సెల్ఫీ కెమెరా
స్టీరియో స్పీకర్స్
Li-Ion 3279 mAh బ్యాటరీ
15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook