Cmf Phone 1 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ మొబైల్స్ విక్రయాలతో మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రావడంతో చాలా మంది యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న నథింగ్ సబ్-బ్రాండ్ CMF స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ డెడ్ చీప్ ధరతో ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నథింగ్ కంపెనీ సబ్-బ్రాండ్ CMFను బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయం చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోంది. దీంతో పాటు మార్కెట్‌లో కస్టమర్స్ ఆశ్చర్యపోయే విధంగా డిస్ల్పే, కెమెరాలను కలిగి ఉండబోతోంది. ఈ మొబైల్ ఎంతగానో ఆకర్శనీయంగా కనిపించేందుకు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు "నథింగ్ లాక్" అనేక ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది.
ఇక CMF స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.7-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimension 7200 ప్రాసెసర్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 6 GB ర్యామ్, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన, 50MP అల్ట్రావైడ్ డబుల్ కెమెరా సెటప్‌ను అందించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 16MP ఫ్రంట్ ఫేసింగ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 33W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ సెటప్‌తో రాబోతోంది. ఇక ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే దీని ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ CMF ఫోన్ 1, నథింగ్ ఫోన్ (3)తో పాటు జూలైలో లాంచ్ కాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి