Get Fire Boltt Pristine Smartwatch @ Rs 2999: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని రకాల వాచ్‌లున్నా, మార్కెట్ కొన్ని కంపెనీల వాచ్‌లకే విశేష గుర్తింపు ఉంది. అయితే ఫోసిల్ లాంటి బ్రాండ్స్ ఉన్నా ఇటీవల మార్కెట్‌లో లాంచ్ అయిన ఫైర్-బోల్ట్‌కు మంచి ప్రజాదారణ ఉంది. ఎందు కంటే ఈ కంపెనీలకు చెందిన చాలా స్మార్ట్ వాచ్‌లు సాధారణ వినియోగిదారుల బడ్జెట్‌లో లభిస్తాయి. అయితే ఫైర్-బోల్ట్ మొట్టమొదటి సారిగా మహిళా సెంట్రిక్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీనికి ఫైర్-బోల్ట్ ప్రిస్టీన్(Fire Boltt Pristine) అనే నామకరణంతో మార్కెట్‌లోకి వదిలింది. అయితే ఈ స్మార్ట్ వాచ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఆప్పుడు తెలుసుకుందాం..
ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ స్మార్ట్‌వాచ్ ధరలు:
భారతదేశంలో ఫైర్-బోల్ట్ ప్రిస్టీన్ రూ. 2,999 ధరతో కంపెనీ విడుదల చేసింది. అయితే ఇది ప్రస్తుతం మార్కెట్‌లో( వాచ్ సిరామిక్, సిలికాన్ స్ట్రాప్ ) రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే 1 సంవత్సరం వారంటీ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం Firebolt అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలో విక్రయంలో ఉంది. అయితే ఈ వాచ్ మూడు (పింక్, గోల్డ్, సిల్వర్, పెర్ల్ ) విభిన్న రంగుల్లో లభిస్తోంది. కాబట్టి మీరు మంచి స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు.
ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ స్పెక్స్:
ఫైర్-బోల్ట్ ప్రిస్టీన్ (Fire Boltt Pristine) 360 x 360-పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 43mm డయల్ కాన్ఫిగరేషన్‌తో 1.32-అంగుళాల వృత్తాకార డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ స్టెయిన్‌లెస్ బెజెల్, మెటల్ బటన్‌ల వంటి డిజైన్‌తో లభిస్తోంది. ఇది డయల్ 3డి కర్వ్డ్ గ్లాస్‌తో తయారు చేశారు. ఇది 60 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉండడమేకాకుండా అన్ని రకాల పనులును ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Bank Holidays from Today: ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు
ఫీచర్ల:
ఇక ఫైర్-బోల్ట్ ప్రిస్టీన్ (Fire Boltt Pristine) స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే..స్మార్ట్ బ్లూటూత్ కాలింగ్‌తో వస్తుంది. మీరు ఈ ఏ క్రమంలోనైన ఫోన్‌ను తాకకుండా కాల్‌లను లిఫ్ట్ చేయోచ్చు. అంతేకాకుండా వినియోగదారులు కాల్ హిస్టరీ, కాల్ లిస్ట్, క్విక్ డయల్ ప్యాడ్‌తో సహా కాంటాక్ట్ సింక్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వాచ్‌లో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో మీరు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుకోవచ్చు.
Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook