GPay Cashback: ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది గూగుల్ పే. గూగుల్ పేలో భారీగా క్యాష్‌బ్యాక్ రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ మీ కోసం..
గూగుల్ పేమెంట్ కొన్నేళ్లుగా మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. డబ్బులు పంపించేందుకు లేదా అద్దె చెల్లించేందుకు, కొనుగోళ్లకు, చెల్లింపులకు గూగుల్ పే విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ప్రారంభంలో గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసినప్పుడు భారీగా క్యాష్‌బ్యాక్ వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో క్యాష్‌బ్యాక్ రావడం తగ్గిపోయింది. వచ్చినా చాలా తక్కువ మొత్తం వస్తోంది. ఇప్పుడు మేం మీకు చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే గూగుల్ పేతో భారీగానే క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
గూగుల్ పేమెంట్ యాప్‌లో చాలా ప్లాన్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా ప్రత్యేకమైన పేమెంట్ చేసినప్పుడు తప్పకుండా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ చెల్లింపుల్లో గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, పెట్రోల్ బిల్ వంటివి ముఖ్యమైనవి. ఈ పేమెంట్స్ సమయంలో గూగుల్ పే వాడితే కచ్చితగా క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
ఒకే ఎక్కౌంట్‌కు పెద్దమొత్తంలో డబ్బులు పంపిస్తుంటే..క్యాష్‌బ్యాక్ గట్టిగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా ఉండదు. క్యాష్‌బ్యాక్ తప్పకుండా ఉండాలంటే వేర్వేరు ఎక్కౌంట్లకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల క్యాష్‌బ్యాక్ కచ్చితంగా వస్తుంది.
ఒకేసారి పెద్దమొత్తంలో నగదు పంపించడం ద్వారా ఎక్కువ క్యాష్‌బ్యాక్ అనేది ఉండదు. గూగుల్ పేలో క్యాష్‌బ్యాక్ కచ్చితంగా ఉండాలంటే 2-3 విడతలుగా లేదా 2-3 ఎక్కౌంట్లకు పంపించాలి. ఇలా చేయడం వల్ల క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు పెరుగుతాయి.
Also read: LPG Cylinders: వినియోగదారులకు మరో షాక్, ఏడాదికి 15 సిలెండర్లే, త్వరలో కొత్త నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook