Honor Magic 6 Pro Leaked Price: గతంలో హానర్(Honor) స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండేది. కానీ రెడ్‌మీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ అయిన తర్వాత క్రమంగా ఈ హానర్ మొబైల్స్ విక్రయాలు పడిపోతూ వచ్చాయి. అయితే చాలా రోజుల తర్వాత హానర్ బ్రాండ్ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ మొబైల్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హానర్(Honor) విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్స్ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ సిరీస్ మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా అధికారికంగా ప్రకటించింది. కంపెనీ జనవరి 10 నుంచి జనవరి 11 వరకు చైనాలో జరిగే రెండు రోజుల ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 పోర్షే డిజైన్, హానర్ మ్యాజిక్ 6 ప్రో అనే మూడు మోడల్స్ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే చైనాలో ప్రీబుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లు విడుదలకు ముందే కంపెనీ Digital Chat Station Weiboలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోస్ ప్రకారం..మొబైల్ గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో లభించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా బ్యాక్ ప్యానెల్ విషయానికొస్తే..ఇంతముందు ఎప్పుడు చూడని ఫినిషింగ్‌తో రాబోతోంది. దీంతో పాటు త్రిభుజాకార రూపంలో త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ముందు భాగంలో రెండు సెల్ఫీకెమెరాలకు పిల్ ఆకారపు కటౌట్‌ను కలిగి ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఇక Honor Magic 6 Pro స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే..ఇంతక ముందు కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో ఎలాగైతే ఫీచర్స్‌తో వెల్లడించిందో అవే స్పెషిఫికేషన్స్, ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ టీజర్‌లో కంపెనీ డ్యూయల్-LED ఫ్లాష్, మైక్రోఫోన్, 100x జూమ్‌తో కూడిన కెమెరా వంటి ఫీచర్స్‌ను పేర్కొంది. దీంతో పాలు ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ కోసం MagicOS 8తో రాబోతోంది. 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది.
ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఫ్రెంట్ లుక్ విషయానికొస్తే..ఈ మొబైల్ 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ (ToF) 3D కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది క్విక్ ఫేస్ అన్‌లాకింగ్ కోసం ఎంతగానో సహాయపడుతుంది. ఈ సిరీస్ ధర విషయానికొస్తే..రూ.111,990తో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter