Red Magic 8 Pro Price: 24 జీబీ ర్యామ్‌తో మార్కెట్‌లోకి గేమింగ్‌ ఫోన్‌..దీని ఫీచర్స్‌ తెలిస్తే, పెద్ద ఫోన్ల జోలికి పోరు..

Red Magic 8 Pro Price In India: త్వరలోనే భారత మార్కెట్‌లోకి 24జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ గేమింగ్‌, మల్టీ టాస్కింగ్ చేసేందుకు రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లను అందించబోతునట్లు కంపెనీ తెలిపింది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 27, 2023, 03:08 PM IST
 Red Magic 8 Pro Price: 24 జీబీ ర్యామ్‌తో మార్కెట్‌లోకి గేమింగ్‌ ఫోన్‌..దీని ఫీచర్స్‌ తెలిస్తే, పెద్ద ఫోన్ల జోలికి పోరు..

Red Magic 8 Pro Price In India: ప్రస్తుతం యువత గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం భారీ ర్యామ్‌ కలిగి స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ రెడ్ మ్యాజిక్ చెందిన స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ 24జీబీ ర్యామ్‌తో తర్వలో రాబోతోంది. రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రోను అత్యంత శక్తి వంతమైన స్మార్ట్‌ ఫోన్‌గా ఇతర దేశాల్లో ఎంతో పేరు పొందింది. రెడ్ మ్యాజిక్ జూలై 5న భారత దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Nubia చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ పాటు.. 24GB ఫిజికల్ ర్యామ్ అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. భారీ ర్యామ్ సామర్థ్యంలో కలిగి ఈ మొబైల్‌ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌తో పాటు హెవీ ఎడిటింగ్ ప్రక్రియను కూడా సులభంగా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వీలైనంత త్వరలోనే Red Magic 8S Proను 24GB RAMతో విడుదల చేయబోతున్నట్లు వివరించారు. 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై OnePlus, Realme చెందిన మొబైల్స్‌ కూడా పని చేయవని యూట్యూబ్‌ టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో కూడా 24 జిబి ర్యామ్‌తో రాబోతోందని తెలిపారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా దీనికి తోడుగా రియల్‌ మీ కూడా 24GBతో రాబోతోందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే Red Magic 8S Pro స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వస్తే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లపై పోటీకి దిగే ఛాన్స్‌ ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

RedMagic 8S ప్రో ఫీచర్లు:
❃ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
❃ 3.36GHz క్లాక్ స్పీడ్‌
❃ Adreno 740 GPU క్లాక్ స్పీడ్
❃ 680MHz నుంచి 719MHzకి బూస్ట్ అయ్యే ఫీచర్‌
❃ 6.8-అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే
❃ 120Hz రిఫ్రెష్ రేట్
❃ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
❃ 16-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరా
❃ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❃ 6000mAh బ్యాటరీ సపోర్ట్‌

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News