Samsung Galaxy S24 Ultra Price: ఏకంగా రూ.51 వేల డిస్కౌంట్‌తో Samsung Galaxy S24 Ultra మొబైల్‌ పొందండి.. ఇదే మంచి అవకాశం మళ్లీ రాదు!

Samsung Galaxy S24 Ultra Price Cut: అత్యంత తక్కువ ధరలోనే Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 19, 2025, 02:48 PM IST
Samsung Galaxy S24 Ultra Price: ఏకంగా రూ.51 వేల డిస్కౌంట్‌తో Samsung Galaxy S24 Ultra మొబైల్‌ పొందండి.. ఇదే మంచి అవకాశం మళ్లీ రాదు!

Samsung Galaxy S24 Ultra Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ సాంసంగ్‌ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అందుకే ఈ కంపెనీ మొబైల్స్‌ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా మార్కెట్‌లోకి ఇటీవలే లాంచ్‌ అయిన Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్‌కు మంచి ప్రజాదరణ లభించింది. అలాగే దీని సేల్స్‌ కూడా చాలా బాగా సాగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ఇండియా అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

అమెజాన్‌ స్టోర్‌లో ఈ Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు MRP ధర రూ.1,34,999 కాగా.. వివిధ ఆఫర్స్‌ పోనూ..రూ.99,999కే పొందవచ్చు. అలాగే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.51,499 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌ను పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది.  ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనంగా అనేక రకాల డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కూడా మరింత తగ్గింపు పొందవచ్చు.

ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.  అయితే ఈ డిస్కౌంట్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌తో పాటు బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. పెద్ద బ్రాండ్‌ మొబైల్‌.. మంచి కండీషన్‌లో ఉంటేనే ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. ఇక దీనిపై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది కొనుగోలు చేసే క్రమంలో Amazon Pay ICICI కార్డ్‌ని వినియోగిస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఇక ఈ Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.8-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రీమియం 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసేందుకు చాలా బాగా వర్క్‌ అవుతుంది. ఇది AI-ఆధారిత కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు స్పెషల్‌గా ప్రీమియం బ్యాటరీని కూడా అందిస్తోంది. అలాగే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందించింది. ఇక ఈ మొబైల్‌పై ఉన్న అన్ని ఆఫర్స్‌ పోనూ.. రూ.48,500కే లభిస్తోంది..

AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News