Vivo V25 5G : ఇండియన్ మార్కెట్‌లోకి వివో వీ25 5జీ.. లాంచింగ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్స్ ఇవే...

Vivo V25 5G Launching Date Price and Specifications: వివో నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. వివో వీ25 5జీ పేరిట సెప్టెంబర్ 15న ఈ మోడల్ లాంచ్ అవనుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 11, 2022, 03:27 PM IST
  • వివో నుంచి కొత్త మోడల్
  • వివో వీ25 5జీ స్మార్ట్ ఫోన్ లాంచింగ్
  • ధర, ఫీచర్స్.. పూర్తి వివరాలివే...
Vivo V25 5G : ఇండియన్ మార్కెట్‌లోకి వివో వీ25 5జీ.. లాంచింగ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్స్ ఇవే...

Vivo V25 5G Launching Date Price and Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి వివో వీ25 5జీ మోడల్ ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ కానుంది. ఇదివరకు వివో వీ25 ప్రో మోడల్‌ను లాంచ్ చేసిన వివో.. ఇప్పుడదే సిరీస్‌లో భాగంగా కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు వివో వీ25 5జీని ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు తాజాగా ఆ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

వివో వీ25 5జీ ధర,  ఫీచర్స్ :

వివో వీ25 5జీ బ్లాక్ అండ్ బ్లూ కలర్స్‌లో లభించనుంది. అంతేకాదు, వివో వీ25 ప్రో లాగే దీనికి కూడా కలర్ చేంజింగ్ టెక్నాలజీతో కూడిన ఏజీ గ్లాస్ ఉంటుంది. ఈ ఫీచర్ కారణంగా డివైజ్ బ్యాక్ ప్యానెల్ ఆటోమేటిగ్గా రంగులు మారుతుంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరా 50 మెగా పిక్సెల్‌తో ఉంటుంది. డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 0S, 4500 బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఛార్జింగ్ కెపాసిటీ 44W ఉంటుంది.

ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియేషన్స్‌లో లాంచ్ అవనుంది.  8GB + 128GB, 12GB + 256GB వేరియంట్స్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.30 వేల వరకు ఉండొచ్చు. 

ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ థాయిలాండ్‌లో లాంచ్ అయింది. మరో 3 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. వివో స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

Also Read: Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్ 

Also Read: రాజావారు రాజావారు అని పిలిచేరు...మహావృక్షం నేలకొరిగింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News