Vodafone idea plans: వోడాఫోన్ ఐడియా అద్భుత ఆఫర్, 75 జీబీ డేటా అదనం, ఇవాళ ఆఖరు తేదీ

Vodafone idea plans: ప్రముఖ టెలీకం కంపెనీ వోడాఫోన్ ఐడియా అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. ఆ ప్లాన్ తీసుకోవాలంటే ఇవాళే ఆఖరు తేదీ. ఇంతకీ వీఐ ఆఫర్ చేస్తున్న ఆ ప్లాన్ వివరాలేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 10:55 PM IST
Vodafone idea plans: వోడాఫోన్ ఐడియా అద్భుత ఆఫర్, 75 జీబీ డేటా అదనం, ఇవాళ ఆఖరు తేదీ

Vodafone idea plans: ఇది ఫెస్టివ్ సీజన్. దసరా నడుస్తోంది. త్వరలో దీపావళి పండుగ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలీకం కంపెనీలు వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే వోడాఫోన్ ఐడియా అద్భుమైన ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ పొందేందుకు ఇవాళే ఆఖరు తేదీ మరి.

ఈ ఫెస్టివల్ సీజన్‌లో వోడాఫోన్ ఐడియా 5జి సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో యూజర్ల కోసం ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 3099 రూపాయలు, 1449 రూపాయల ప్లాన్‌తో అందుతుంది. ఈ ప్లాన్ తీసుకోవాలంటే చివరి తేదీ అక్టోబర్ 6. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా, ఉచిత డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభించనున్నాయి.

3099 రూపాయల ప్లాన్

ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ఒక్కటే కాకుండా..75 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, రోజుకు 100 వరకూ ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇంకా అదనంగా కొన్ని ప్రయోజనాలున్నాయి. ఇందులో రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకూ అపరిమిత డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, 2జీబీ వరకూ డేటా డిలైట్ ప్రత్యేక ప్రయోజనాలు.

1449 రూపాయల ప్లాన్

ఈ ప్లాన్ 180 రోజులు అంటే 6 నెలలకు వర్తిస్తుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, 50 జీబీ అదనపు డేటా లభిస్తున్నాయి. ఇందులో కూడా రోజుకు 100 వరకూ ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఇంకా అదనపు ప్రయోజనాలున్నాయి.

Also read: Business ideas: కేవలం 10 వేలతో ప్రారంభం, ప్రతి నెలా లక్షలాది రూపాయల సంపాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News