Covid-19 in Gurukul college: గురుకుల కళాశాలలో కరోనా కలకలం.. ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్!

Gurukul College: గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 01:54 PM IST
Covid-19 in Gurukul college: గురుకుల కళాశాలలో కరోనా కలకలం.. ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్!

Corona Cases in Gurukul College: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) కురవి గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కరోనా (Corona Cases in Gurul College) కలకలం రేగింది. ముగ్గురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్​గా తేలింది.

వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థినులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇతర విద్యార్థినులకు వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థులకు వైరస్ సోకుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 

తెలంగాణలో నిన్న 482 కరోనా కేసులు (Corona Cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,971కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,031కి చేరింది.

వైరస్ నుంచి 212 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,048 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు..తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి (Omicron Cases in Telangana) చేరింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 482 కరోనా కేసులు.. 84కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37,379 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 1,71,830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News