Monkeypox: ఓ వైపు కరోనా.. మరో పక్క మంకీ పాక్స్‌తో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నుంచి పలు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో మంకీ పాక్స్ భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో ఆ జాడలు కనిపిస్తున్నాయి. రెండురోజుల కింద కామారెడ్డి జిల్లాలో ఓ కేసు నమోదు కాగా..కొత్తగా ఖమ్మం జిల్లాలో మంకీ పాక్స్ లక్షణాలు ఓ వ్యక్తిలో ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమానితుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు తరలించారు. ఇటు కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 6న బాధితుడు కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. ఈనెల 20న అతడికి జ్వరం రావడంతోపాటు శరీరంపై దద్దుర్లు వచ్చాయి.
ఈక్రమంలో అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మంకీ పాక్స్‌పై భయాందోళనలు అవసరం లేదని ఇదివరకే మోదీ సర్కార్ ప్రకటించింది.
వైరస్ పట్ల అత్యంత అప్రమత్తం అవసరమని తెలిపింది. ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాంక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి నిర్ధారణ అయ్యింది. ఐతే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో అనుమానిత కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో హెచ్చుతగ్గుల మధ్య కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో 18 వేల 313 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉంది. ఇటు రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా 20 వేల 742 మంది కరోనా జయించారు. దీంతో రికవరీ రేటు 98.47 శాతం ఉందని అధికారులు తెలిపారు. ఇటు కరోనా వల్ల 57 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1.45 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల రేటు 0.33 శాతంగా ఉందని కరోనా బులిటెన్‌లో కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Also read:CM Jagan: కేంద్రంపై యుద్ధం చేస్తున్నాం..పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..!
Also read:AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook