BRS MLA Durgam Chinnaiah: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

BRS MLA Durgam Chinnaiah: దళితులు, తన జాతి ( నేతకాని ) పేదల భూమిని బినామీల పేరుతో పట్టా మార్పు చేయించుకొని కబ్జా చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నయ్య ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2023, 06:19 AM IST
BRS MLA Durgam Chinnaiah: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

BRS MLA Durgam Chinnaiah: దళితులు, తన జాతి ( నేతకాని ) పేదల భూమిని బినామీల పేరుతో పట్టా మార్పు చేయించుకొని కబ్జా చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నయ్య ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో "దుర్గం" దందా నడుస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. బాధితులు, బెల్లంపల్లిలో బిజెపి తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కొయ్యల ఏమాజిని ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. దీంతో , సోమవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏమాజీ.. విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.

ఏమాజీ చెబుతున్న వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలంలోని ఆకేనపల్లీ శివారులోని సర్వే నెంబర్ 3/పైకి/పి లో బురదగ్గూడెం గ్రామానికీ చెందిన దుర్గం లక్ష్మయ్యకు 2.75 ఎకరాల భూమి ఉంది. గత 70 సంవత్సరాల నుండి వారు అక్కడ భూమి సాగు చేసుకుంటున్నారు. పట్టేదారు లక్ష్మయ్య గతంలోనే చనిపోగా.. ఆయన ఏకైక వారసుడు దుర్గం పోషం ఇటీవల కరోనాతో చనిపోయారు. పోషం భార్య దుర్గం లక్ష్మి తన పేరిట పట్టా మార్పు (విరాసిత్) చేయాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసింది. రెవెన్యూ అధికారులు విచారణ జరిపించి, మొఖ పై పంచనామా చేశారు. భూమి వీరిదేనని నిర్ధారణ చేశారు. 

అంతలోనే ఆ భూమిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కన్ను పడింది. జాతీయ రహదారి పక్కన భూమి ఉండడంతో దాని విలువ పెరిగింది. దాన్ని ఎలాగైనా కబ్జా చేయాలనుకున్నాడు. తన బినామీ అయిన సోమగూడెం మాజీ సర్పంచ్, బి ఆర్ ఎస్ నాయకుడు భూక్యా రాంచందర్, అతని అనుచరులు భూమిలో వచ్చి పట్టేదార్ వారసులను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. బాధితులు పోలీసులను, తహసీల్దార్ ను ఆశ్రయించగా బాధితులకు రక్షణ కల్పించాలి అని తహసీల్దార్ ఆదేశించారు. కానీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అధికార బలంతో బినామీ వ్యక్తి దుర్గం లింగయ్య పట్టేదార్ వారసుడు అని ఎలాంటి విచారణ జరపకుండానే పట్టా మార్పు చేశారు. 

ఇది కూడా చదవండి : BJP About KCR: మోదీ వ్యాక్సిన్ ఇప్పిస్తే.. కేసిఆర్ మందు పోయిస్తుండు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దొంగ పట్టాతో భూమిని కబ్జా చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్ డీ ఓ, తహసీల్దార్ వెంటనే విచారణ జరిపించి దొంగ పట్టా రద్దు చేసి, దుర్గం లక్షికి పట్టా ఇవ్వాలనీ, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, ఎఫ్ సి ఐ సభ్యులు పులగం తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవ్ రెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూ లాల్ యాదవ్, జిల్లా కార్యదర్శి గోవర్దన్, శ్రావణ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు దుర్గం లక్ష్మి, జాడి తిరుపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Telangana Group1 Exams: మరోసారి అనుమానాస్పదంగా మారిన టిఎస్పీఎస్సీ వైఖరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News