Bhadradri Kothagudem: దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య

Woman Sarpanch Raped in Bhadradri Kothagudem: ఓ మహిళా సర్పంచ్‌పై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. అవమాన భారంతో బాధిత సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 01:48 PM IST
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన
  • మహిళా సర్పంచ్‌పై అత్యాచారం
  • అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ
Bhadradri Kothagudem: దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య

Woman Sarpanch Raped in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు మహిళా సర్పంచ్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘటనతో తన పరువు పోయిందని తీవ్ర అవమానంగా భావించిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని కోమటిపల్లి గ్రామ సర్పంచ్‌ భూక్యా కుమారి(30)పై ఇటీవల నవీన్ అనే అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి మరో వ్యక్తి సహకరించాడు. అత్యాచార ఘటనపై కుమారి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అత్యాచార ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

కుటుంబ సభ్యులు మొదట ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భూక్యా కుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (ఆగస్టు 4) మృతి చెందింది. కుమారి ఆత్మహత్యకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమటిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఏపీలోని విజయనగరంలోనూ గురువారం (ఆగస్టు 4) ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పూసపాటి రేగ మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌పై 11 మంది అత్యాచారయత్నం చేశారు. సర్పంచ్ గట్టిగా ప్రతిఘటించడంతో చుట్టుపక్కలవారు పరిగెత్తుకొచ్చేసరికి దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

Also Read: RBI Repo Rate: మరోసారి రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ... బ్యాంకు రుణాలపై పెరగనున్న వడ్డీ భారం..  

Also Read: Bimbisara Movie: హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్.. కాలర్ ఎగరేస్తున్న నందమూరి ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News