WEF 2025 Investments: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. దావోస్ సదస్సులో మూడో రోజు తెలంగాణకు భారీ పెట్టుబడి లభించింది. ఈ ఏడాదిలోనే అత్యంత భారీ పెట్టుబడి తెలంగాణకు దక్కింది. ఈ మేరకు ప్రభుత్వంతో ప్రఖ్యాత సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల్లో ఆ పెట్టుబడిని తెలంగాణలో పెడతామని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది.
Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్'.. రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంపు?
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో బుధవారం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. పెట్టుబడితో తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి రెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Also Read: K Kavitha: 'రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మూసీ ప్రాజెక్టు.. ఢిల్లీకి డబ్బుల మూటలు తరలించే కుట్ర
ఈ పెట్టుబడితో కంట్రోల్ఎస్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ సామర్థ్యం 400 మెగా వాట్లు కాగా.. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఒప్పందం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతోందని.. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంపై కంట్రోల్ ఎస్ యాజమాన్యం గర్వంగా ఉందని ప్రకటించింది. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
పెట్టుబడులపై తీవ్ర విమర్శలు
ఈ పెట్టుబడులు ఎప్పుడు పెడతారు? ఎన్ని విడతల్లో పెడతారనే వివరాలు వెల్లడి కాలేదు. దావోస్ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల ఒప్పందాలపై విమర్శలు.. తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు రావాల్సి ఉండగా.. దావోస్‌లో ప్రభుత్వం చేసుకుంటున్న కంపెనీల పెట్టుబడులన్నీ రాష్ట్రానికి సంబంధించినవే కావడం గమనార్హం. మేఘా కంపెనీ, స్కైరూట్ కంపెనీలు తెలంగాణకు చెందినవే. ఈ సంస్థల పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లడం ఎందుకు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ పెట్టుబడులపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.
Data is the new oil, and Telangana is leading the way! At #WEF2025, I thanked and congratulated Mr. Sridhar Pinnapureddy, CEO of CtrlS Datacenters, for signing an MoU with the Telangana Government to invest ₹10,000 Cr in Hyderabad.
This will establish Asia's largest data hub… pic.twitter.com/y2hHLcfkxW
— Sridhar Babu Duddilla (@OffDSB) January 22, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter