Konda Vishweshwar reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు మరో గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నుంచి హఠాత్తుగా కాంగ్రెస్ గూటికి చేరిన కొండా విశ్వేశ్వర్ర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరమంటున్న కొండా..బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీకు ఇటీవల షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీ వీడిపోతున్నారు. ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. ఇటీవలే అంటే 2018లో ఒక్కసారిగా టీఆర్ఎస్ (TRS) పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకు రాజీనామా చేశారు. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ అందించారు. పారిశ్రామిక వేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2013లో రాజకీయాల్లో ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. హఠాత్తుగా 2018లో టీఆర్ఎస్ వదిలి. కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో చేవెళ్ల(Chevella)ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇవాళ ఉదయం పార్టీకు రాజీనామా చేస్తూ సంచలనం కల్గించారు.
మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని నిర్ణయించుకున్నారు. తరువాత ఏంటనే ప్రశ్నకు సమాధానం కూడా విన్పిస్తోంది. మూడు నెలల విశ్రాంతి తరువాత బీజేపీ(BJP) తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌పై హామీతోనే కాంగ్రెస్ పార్టీని వీడారనేది సమాచారం. కొండా విశ్వేశ్వర్ రెడ్డిది చరిత్ర ఉన్న కుటుంబం. ఈయన తాత రంగారెడ్డి తెలంగాణలో రజాకార్లతో పోరాడి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయనేతగా ఎదిగారు. అతని పేరుమీదే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar reddy) దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయనేత. అమెరికా పౌరసత్వం ఉండి ఎంపీగా చేసిన వ్యక్తి కావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook