Shivaji Jayanthi Tragedy: హిందూ సామ్రాజ్యాధినేత, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసుకోవాల్సి ఉండగా ఆ సంబరాలు తీవ్ర విషాదం నింపాయి. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఒకరి మృతికి దారి తీయగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మృతుడి కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం?
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో యువకులు అంతా కలిసి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్బంగా బుధవారం గ్రామంలో జెండావిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. జెండా స్తంభం విద్యుత్ తీగలకు తాకింది. వెంటనే విద్యుత్ జెండా కర్రకు పాకడంతో దాన్ని పట్టుకుని ఉన్న 13 మంది యువకులకు కరెంట్ షాక్ తగిలింది. అందరూ కుప్పకూలిపోవడంతో వెంటనే గ్రామస్తులు జెండా కర్రను జాగ్రత్తగా తీసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు వడ్డే కరుణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన యువకులను గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉందని సమాచారం. ఈ ప్రమాదంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన లింగ ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, అతడి స్నేహితులు కోరుతున్నారు. బాధితుడి కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందని.. లింగ ప్రసాద్ మరణంతో ఆ కుటుంబంలో తీరని లోటు ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.