CM Kcr: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు శుభవార్త అందించారు. లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. దసరాలోపు కార్మికులకు ప్రోత్సాహకం చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్మికులకు ప్రోత్సాహకం అందించేందుకు సింగరేణి రూ.368 కోట్లు కేటాయించింది. కార్మికులకు దసరాలోపు చెల్లించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అర్హులైన కార్మికులకు దసరా కానుక అందనుంది.
2020,2021లో కార్మికులకు లాభాల్లో వరుసగా 28 శాతం, 29 శాతం వాటాను దసరా కానుకగా చెల్లించారు. 2021-22 సంవత్సరానికి గాను సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సంస్థ కార్మికులకు దసరా కానుక అందించాలన్నారు సీఎం కేసీఆర్. ఈనేపథ్యంలో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు అందాయి. త్వరలో అర్హులైన కార్మికులకు ప్రోత్సాహకం అందనుంది.
Also read:GVL Narasimha Rao: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తధ్యం..బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ..!
Also read:CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి