CM KCR syas Rythu Bandhu will not stop in Telangana: తెలంగాణ రైతులుకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను బతికున్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా ఆగదు అని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు తాను ముందుండి పోరాడతానని సీఎం పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
'వరద కాలువను తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన జలధారగా మార్చుకున్నాం. వరద కాలువ మీద ఇప్పటికే 13 వేల మోటర్లు ఉన్నాయి. ఈరోజు రైతులను కరెంటు బిల్లు అడిగే వాళ్లుఎవరైనా ఉన్నారా?. ఇప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. మరి పెడదామా?. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతుబంధు కానీ రైతు బీమా కానీ అస్సలు ఆగదు. దేశంలో రైతుల ధాన్యాన్ని ఏ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేదు. 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణే' అని సీఎం కేసీఆర్ చెప్పారు.
'బీడీ కార్మికులను పట్టించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా?చెప్పండి. ఒక్క తెలంగాణలోనే బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. అన్నింటిలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం నంబర్ వన్‌గా ఉంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు ఎమ్మెల్యే నిధులు మరో రూ. 10 కోట్లు పెంచుతున్నాం. మనం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతాం. అప్రమత్తంగా లేకపోతే నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోసారి 60-70 ఏళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు. భారత రాజకీయాలను తెలంగాణ రాష్ట్రం ప్రభావితం చేయాలి' అని కేసీఆర్ అన్నారు.
కొండగట్టు అంజన్నకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేశారు. 'కొండగట్టు అంజన్న ఆలయంకు హనుమాన్ భక్తులు నిత్యం లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేది. 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చాం. కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా' అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
Also Read: Zombies Viral Video: అమెరికా రోడ్లపై హల్చల్.. పగటిపూట స్వేచ్చగా తిరుగుతున్న జాంబీలు!
Also Read: IND Vs BAN: సెంచరీ బాదిన మెహిదీ హసన్.. భారత్ ముందు భారీ టార్గెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.