CM Revanth Reddy on Caste Survey: గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో కుల గణనపై అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. ఇచ్చిన నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అడ్డంకులు వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియ గాంధీ నెరవేర్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి కల సాకారం చేశారని గుర్తుచేశారు.
ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి రెడ్డినా.. మహేష్ గౌడ్ గౌడా అనేది కాదని.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం మనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదని.. కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదని.. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని చెప్పిన ముఖ్యమంత్రి.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
అధికారులపై పని చేయాల్సిన బాధ్యత ఉన్నా.. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు అన్ని జిల్లాలకు ఒక్కొ అబ్జర్వర్‌ను నియమించుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని హెచ్చరించారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలని.. కుల గణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. నవంబర్ 31వ తేదీలోగా కుల గణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ నుంచే ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించాలని ముఖ్యమంత్రి అన్నారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని.. ఇది మెగా హెల్త్ చెకప్ వంటిదన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని.. 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని స్పష్టం చేశారు.
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.