CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2024, 07:06 PM IST
  • డీకే అరుణపై రేవంత్ పంచ్ లు..
  • పాలమురు బిడ్డల ఉసురుపోసుకుందంటూ వ్యాఖ్యలు..
CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Strong Comments on BJP DK Aruna at  kodangal: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు పంచ్ లు కురిపిచుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుట ఎగురవేయడమే టార్గెట్ గా  సీఎం రేవంత్ రెడ్డి  పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని అపోసిషన్ పార్టీలైన  బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికల ప్రచారంలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనమాట్లాడుతూ.. ఇప్పటికే కొడంగల్ కు ఐదు సార్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా.. బీజేపీ మహబూబ్‌గర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై రేవంత్ సెటైరీక్ గా కామెంట్లు చేశారు. డీకే అరుణ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కత్తిగా మారి... పాలమూరు బిడ్డల కడుపులో పొడిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. డీకే అరుణతో నాకు పోటీ ఏంటీ.. ఆమె దగ్గర ఉన్నదేమీటీ.. నేను ఆశీంచేదేంటనీ ఎద్దేవా చేశారు.  కొడంగల్‌ను కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఒక్కటయ్యారన్నారు.

Read More: TS Summer Holidays: తెలంగాణలోని స్కూళ్ల కు రేపటి నుంచే సమ్మర్ హలీడేస్.. రీ ఓపెన్ ఎప్పుడో తెలుసా.?

ఇప్పుడు ఎన్నికలలో పాలమూరుబిడ్డలు సరైన విధంగా ఓటువేసి తమ నాయకుడిని ఎన్నుకొవాలని కోరారు. తనకు తెలంగాణ ను డెవలప్ చేయాలనే ఆశమాత్రమే ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతెలంగాణకుచేసిందేమిటని ప్రశ్నించారు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన, కేసీఆర్ ను ఇంటికి పంపి అధికారం కైవసం చేసుకున్నామని, లోక్ సభ ఎన్నికలల కూడా ప్రజలుభారీ మెజార్టీతో కాంగ్రెస్ నుగెలిపించాలని సీఎం రేవంత్ కోరారు. అదే విధంగా తెలంగాణలో.. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు.

ఆగస్టు 15  లోపల  ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను రుణమాఫీ చేస్తానని , మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరివేసుకుని చనిపోయిన కూడా రుణమాఫీ తప్పకుండా అమలుచేస్తామని సీఎం రేవంత్ తెల్చిచెప్పారు. అదే విధంగా.. రైతుల వడ్లు కొనడమే కాదు.. రూ. 500 బోనస్ ను కూడా చెల్లిస్తామని చెప్పారు.పెద్దలు చెబుతుంటారు.. ఇంట్లో గెలిచి.. రచ్చ గెలవాలని.. అందుకే.. ముందు మనం కొడంగల్ లో విజయం సాధించి, ఆ తర్వాత దేశంలో బీజేపీని ఓడిద్దామంటూ కూడా పిలుపునిచ్చారు. ప్రధానీ మోదీ దేశానికి చేసిందేమీలేదని, కేవలం ఒక వర్గానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తు, దేశంను పదేళ్లపాటు వెనుకవైపు నడిచేలా చేశారని రేవంత్ అన్నారు. 

Read More: Raghunandan Rao: మోదీ కాలిగోరు వెంట్రుకతో రేవంత్ సమానంకాదు.. ఫైర్ అయిన బీజేపీ రఘనందన్ రావు..

ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ నుజైలు కు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలుచేస్తున్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉరివేసుకున్న కూడా ఆయనకు ప్రజలు అధికారం ఇవ్వరంటూ వ్యాఖ్కలు చేస్తున్నారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్ బస్సుపై కాదు కాదా... మోకాళ్లపై తెలంగాణ అంతట యాత్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ ఉంటడో పోతాడో తెల్వదు... తాను మాట్లాడుతున్నది.. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు వెళ్లడం గురించి అని చమత్కరించారు. నల్లొండ , భువనగిరిలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రచారం చేసిన కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అంతే స్థాయిలో సీఎంరేవంత్ పై మండిపడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News