Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ప్రతీరోజూ రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే.. గత 24 గంటల్లో బుధవారం ( సెప్టెంబరు 9న ) తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 11 మంది మరణించారు. ఈ మేరకు గురువారం ఉదయం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,176కి పెరగగా.. ఇప్పటివరకు కరోనా సోకి 927 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం తెలంగాణలో 32,106 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 1,17,143 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read: Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా.. బుధవారం 63,017 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 19,53,571 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 78 శాతం ఉండగా.. మరణాల రేటు 0.61 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 327 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 195, నల్లగొండ 149 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..