Cyber Cheater Vamshi Krishna: సైబర్ చీటర్, మహా మోసగాడు వంశీ కృష్ణకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. వంశీకృష్ణ బాధితుల చిట్టా చాలా పెద్దదని... అతని బాధితులు వెయ్యికి పైనే ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారానే అందరినీ వలలో వేసుకుని మోసగించినట్లు పోలీసులు నిర్దారించారు. వారి నుంచి సుమారు రూ.40 కోట్లు కాజేసినట్లు అంచనా వేశారు. హర్ష, హర్షవర్ధన్, చెరుకూరి హర్ష అనే మారు పేర్లతో అతను మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
వంశీ కృష్ణ మోసాలు ఇలా :
ఏపీలోని రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ బీటెక్ చదివాడు. 2014లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. తొలుత కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో పనిచేశాడు. 2015 నుంచి క్రికెట్ బెట్టింగ్స్‌కు అలవాటుపడ్డాడు. ఇదే క్రమంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 10 మంది యువకుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఆ కేసులో అరెస్టయి జైలుకి కూడా వెళ్లివచ్చాడు.
జైలు నుంచి తిరిగొచ్చాక యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచాడు. దాదాపు 94 ఐడీలు సృష్టించాడు. తాను చాలా డబ్బున్న వ్యక్తిని అని.. సేవా కార్యక్రమాలకు ఉదారంగా డబ్బులు ఇస్తుంటున్నానని నకిలీ ఖాతాల ద్వారా తన గురించి తానే ప్రచారం చేసుకునేవాడు. ఎవరైనా యువతులు, మహిళలు డబ్బు సాయం కోరితే వెంటనే ఇచ్చి తన పట్ల నమ్మకం కుదిరేలా చేసుకునేవాడు. ఆ తర్వాత వాళ్లు కూడా వంశీ కృష్ణ గురించి గొప్పగా ప్రచారం చేసేవారు.
ఇదే క్రమంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో, ఆన్‌లైన్ వేదికల్లో పలువురు యువతులు, మహిళలకు మాయ మాటలతో దగ్గరయ్యేవాడు. ముఖ్యంగా రెండో పెళ్లి కోసం చూసే వితంతువులను బుట్టులో వేసుకునేవాడు. అలా వంశీకృష్ణ 1000-1500 మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.4 కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు. వంశీ కృష్ణను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.
Also Read: Horoscope Today July 21st: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారిని తెలియని భయం వెంటాడుతుంది
Also Read: Indian Railway: రైలు టికెట్ కేన్సిలేషన్‌లో కొత్త నియమాలు, ఇకపై నో కేన్సిలేషన్ ఛార్జెస్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook