Huzurabad byelection: ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు శనివారం (Huzurabad by Polls) పోలింగ్ పూర్తయింది. రికార్డు స్థాయిలో 86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో విజయం తమదంటే తమదని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల నోటిఫికేషన్లో పేర్కొంది ఈసీ
ఆగని విమర్శలు..
అయితే పోలింగ్ ముగిసినా కూడా నేతల మధ్య విమర్శాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్ఎస్పై సంచలన (Etala Rajender fire on TRS party) వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచారని ఆరోపించారు. డబ్బులిచ్చి ప్రజాభిప్రాయం మార్చడం, డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదన్నారాయన.
Also read: MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
Aslo read: Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్
పోలింగ్‌కు ముందు మద్యం పంచి, డబ్బులిచ్చి, దాడుల ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారని (BJP vs TRS) టీఆర్ఎస్ను ఉద్దేశించి పేర్కొన్నారు ఈటల. అయితే అవన్నీ దాటుకుని ఓటు వేసినా.. బస్సుల్లో ఆ ఈవీఎంలు మార్చారని, వీవి ప్యాట్లను ప్రైవేటు వాహనాల్లో తరలించినట్లు కూడా తమకు సమాచారం అందినట్లు తెలిపారు ఈటల. ఓటు వేసిన బాక్స్‌లను మాయం చేయడం దుర్మార్గమన్నారు.
పొరపాటు జరిగినట్లు కలెక్టర్ అంగీకరించారని.. ఉత్కఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా అని అన్నారు. తనను ఓడించేందుకు కేసీఆర్ (Etala Rajender on KCR) అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యవహరించిందన ధ్వజమెత్తారు. అయినా చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also read: Huzurabad Badvel Bypoll : హుజూరాబాద్‌లో పోటెత్తిన ఓటర్లు.. బద్వేలులో తగ్గిన పోలింగ్
Aslo read: Huzurabad exit poll results: హుజూరాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరాలు
అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు..
ఈ విషయంలో అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. వీటన్నింటిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈటల రాజేందర్.
స్వయంగా సీపీ చెప్పినా.. దాడులను అడ్డుకోలేకపోయారన్నారు ఈటల. పైగా వీటిని అడ్డుకునే ప్రయత్నంలో తమ వారిపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణకు ఆదేశం..
ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో సీఈఓ చర్యలు ప్రారంభించారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్. వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, ఆర్వోకు ఆదేశం జారీ చేశారు.
దీనితో పాటు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నారు శశాంక్ గోయల్. నవంబర్ 2న ఓట్ల లెక్కుపు జరగనుంది.
Also read: Jagga Reddy About KCR: ‘సమైక్యవాదంతో ముందుకొస్తే కేసీఆర్ కు నేను మద్దతిస్తా’
Aslo read: New excise policy in Telangana: దీపావళి తర్వాత తెలంగాణలో కొత్త మద్యం పాలసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి