Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పక్కనే పెట్రోల్ బంక్, మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

Afzal Gunj Fire Accident: పాతబస్తీలో ఉన్న ఓ టైర్ల గోదాములో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత నిప్పురవ్వ రాజుకుని ఆపై భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయిని స్థానికులు చెబుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 7, 2021, 02:30 PM IST
  • హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పక్కనే పెట్రోల్ బంక్
  • అప్జల్‌గంజ్‌లో ఉన్న ఓ టైర్ల గోదాములో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం
  • 10కి పైగా ఫైర్ ఇంజిన్లు టైర్ల గోదాం వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పక్కనే పెట్రోల్ బంక్, మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

Afzal Gunj Fire Accident: హైదరాబాద్ మహానగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాతబస్తీ అప్జల్‌గంజ్‌లో ఉన్న ఓ టైర్ల గోదాములో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత నిప్పురవ్వ రాజుకుని ఆపై భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయిని స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

స్థానికుల నుంచి అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తోంది. 10కి పైగా ఫైర్ ఇంజిన్లు టైర్ల గోదాం వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad)లోని ఈ టైర్ల గోదాంలో భారీగా టైర్లు ఉండడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ చుట్టుపక్కలకు స్థానికులు రాకూడదని అగ్నిమాసక సిబ్బంది వారికి సూచిస్తున్నారు. పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో కోవిడ్19 కలకలం, తాజాగా 2 వేల చేరువలో పాజిటివ్ కేసులు

ఘటనా స్థలానికి సమీపంలో పెట్రోల్ బంక్ సైతం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భారీ అగ్రిప్రమాదం సంభవించడంతో చాదర్ ఘాట్ - అఫ్జల్‌గంజ్ దారిలో ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తుతోంది. మరికొన్ని ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకునేందుకు స్థలం ఇరుకుగా ఉండటంతో సమస్య తలెత్తుతోందని సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News