Kishan Reddy Chit Chat: కేంద్ర, రాష్ట్ర రాజకీయాలతోపాటు బీజేపీ సంస్థాగత ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో లేనని.. అధిష్టానం ఇచ్చిన బాధ్యత చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైనా ఎంపికవచ్చొని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో.. ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కానీ ఢిల్లీలో డప్పు కొట్టుకుంటున్నాడని.. వాటిని ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
Also Read: KPHB Colony: కేపీహెచ్‌బీ కాలనీకి భారీ గండం.. హౌసింగ్ బోర్డు స్థలాలు వేలానికి?
తాజా రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కొన్ని కీలక అంశాలపై స్పందించారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో వినిపించే వాయిస్ బీజేపీ మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ బిల్లులు పెండింగ్ పెట్టింది. పంచాయతీల నిధులను మళ్లించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ప్రజలను మోసం చేస్తోంది' అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే గ్రామాలను అభివృద్ధి చేస్తోందని.. శ్మశాన వాటికల నుంచి నరేగా నిధుల వరకు అన్ని కేంద్రమే పంచాయితీలకు అందిస్తోంది' అని వెల్లడించారు.
Also Read: DK Aruna: 'రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'
'కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు. వాళ్లు పంచాయతీలను ఏం అభివృద్ధి చేస్తారు?' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అప్పుల కోసం చూస్తున్నాడు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది' అని విమర్శించారు. 'తెలంగాణలో 6 గ్యారెంటీలపై మోసం చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో అబద్ధాలు చెబుతున్నాడు. అతడి మాటలు ఎవరూ నమ్మరు' అని స్పష్టం చేశారు.
'ఉచితాలకు వ్యతిరేకమని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా హామీలు ఇవ్వాలని.. లేని పక్షంలో రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పాం' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 'బీర్, బ్రాందీ విక్రయించిన నిధులను కూడా రేవంత్ రెడ్డి మళ్లిస్తున్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు' అని సంచలన ఆరోపణలు చేశారు. 'ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే నిధులు ఇస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,445 కోట్లు ఇచ్చాం' అని వివరించారు.
'కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన రాజకీయ శత్రువు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఎవడో ఏదో అన్న వ్యాఖ్యలున మమ్మల్ని అడగొద్దు. ఎవరైనా అలా అంటే చెంప చెళ్లుమనిపించండి' అని కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ముస్లింలే అసద్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆయన పరిస్థితి పిట్టల దొరలాగా మారింది. మోడీని ఓడిస్తా అన్నాడు. కానీ మూడుసార్లు ప్రధాని అయ్యారు. రామజన్మభూమి నిర్మిస్తే అంతు చూస్తామన్నారు.. మేం కట్టి చూపించాం' అని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter