Huzurabad by Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో (బుధవారం 27-10-2021) తెరపడనుంది. ఎన్నికల సంఘం విధించిన గడువు ప్రకారం.. అభ్యర్థులందరు 72 గంటల ముందే తమ ప్రచారాన్ని ముగించాలి. అంటే బుధవారం సాయంత్రం 7 వరకు మాత్రమే ప్రత్యక్ష ప్రచారానికి గడువుంది. గడువు తర్వాత ప్రచార మైకులు ముగబోనున్నాయి.
ఈ నెల 30న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం పేర్కొంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 28 నాటికి హుజూరాబాద్‌లో 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,719 మంది మహిళలు, 1,17,563 మంది పురుషులు.
Also read:Warning to Mutton Buyers: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంత్రాక్స్.. మటన్ కొనే ముందు ఇవి చూడండి
Also read:T-Govt Key Decision: వ్యాక్సినేషన్ తీసుకొని వారికి నో రేషన్, నో పెన్షన్ క్లారిటీ
చివరి రోజూ జోరు..
ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. బుధవారం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో ప్రధాన నేతలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొననున్నారు.
టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్‌రావు, మంత్రి గంగుల కమలాకర్ నేడు ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇక ఇంటింటి ప్రచారమే..
ప్రత్యక్ష ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు, మద్దతుదారులు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందకు చివరి ప్రయత్నాలన్ని చేయనున్నారు.
తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు డబ్బు, మధ్యం పంచే అవకాశాముందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముందస్తు ప్రచారం..
టీఆర్ఎస్ పార్టీని విడిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ నియోజగవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నిజానికి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవక ముందే ప్రధాన పార్టీలు తమ కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. నియోజకవర్గంలో ముందస్తు ప్రచారం కూడా ప్రారంభించారు.
టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్‌ను బరిలోకి దించింది.
Also read: TRS Plenary: 9వ సారి తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
విమర్శలు, ప్రతి విమర్శలతో పోటా పోటీగా..
ప్రధాన పార్టీలన్ని ఉప ఎన్నికకు పోటా పోటీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన అహంకారం వల్లే ఈ ఉప ఎన్నిక జరుగుతోందంటూ విరుచుకుపడ్డారు. ఈ విమర్శలకు దీటుగా ఈటల సహా బీజేపీ నేతలు టీఆర్ఎస్పై ప్రతి విమర్శలు చేశారు. ఆత్మ గౌరవం కోసమే టీఆర్ఎస్ను వీడినట్లు ఈటల ప్రచారంలో చెప్పుకొచ్చారు.
ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలంటు.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగింది.
దళితబందు పథకం, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, అభివృద్ధి పనుల వంటి వాటిని ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించాయి పార్టీలు.
ప్రచారంలో కీలక నేతలు..
ఈ ప్రచారంలో టీఆర్ఎస్ తరఫున మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, కొప్పు ఈశ్వర్ సహా ఇతర నేతలు పాల్గొని గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కొరారు.
ఈటల రాజేందర్‌ను గెలుపు కోసం.. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానందరాయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర ప్రధాన నేతలు ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించుకునేందుకు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా కీలక నేతలు ప్రచారంలో చేశారు.
Also read: Bathukamma on Burj Khalifa : బుర్జ్ ఖలీఫాపై అట్టహాసంగా బతుకమ్మ ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook