Huzurabad Road Accident: హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం..!

Huzurabad Road Accident: హుజురాబాద్‌లో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 08:17 PM IST
  • హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం
  • అదుపు తప్పి బోల్తా కొట్టిన ఎర్టిగా కారు
  • ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
Huzurabad Road Accident: హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం..!

Huzurabad Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఎర్టిగా కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

హనుమకొండ జిల్లా కు చెందిన బొజ్జ శ్రీనివాస్, ధర్మ తేజ, సువర్ణ, మణి తేజ, వినోద్, సురేష్, అమృత్, సాయికుమార్‌లు వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను మొదట హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకి తరలించినట్లు చెప్పారు.

నారాయణపేట్ జిల్లాలో చోటు చేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. నర్వ మండలం కల్వల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ములుగులో అగ్నిప్రమాదం :

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎదురుగా బ్యాంకు ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ పైపులకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో లక్షల రూపాయాల విలువైన పైపులు కాలి బుడిదయ్యాయి. మంటలు ఎగసిపడి సమీపంలోని కారుకు మంటలు అంటుకోవడంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Prabhas Marriage: 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త.. ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాదే!!

Also Read: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. రేపు ఉదయం 10గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News