Woman IT employee held for selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళా ఐటీ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. ఐటీ ఉద్యోగుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఆమె ఆ బాట పట్టినట్లు గుర్తించారు. రెండేళ్లుగా భర్తతో కలిసి ఆమె గంజాయి విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని నాచారంలో నివాసముండే కొండపనేని మాన్సీ అనే మహిళ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 12న తన భర్త, మరో ఇద్దరు యువకులతో కలిసి ఆమె బోయిన్పల్లి ప్రాంతానికి వెళ్లింది. ఆ నలుగురు కలిసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మాన్సీ, ఆమె భర్త అక్కడినుంచి పారిపోగా.. ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా మాన్సీ దంపతుల వివరాలు వెల్లడించారు. వారిచ్చిన సమాచారంతో మరుసటి రోజు కొంపల్లి ప్రాంతంలో గాలించగా మాన్సీ పట్టుబడింది. మాన్సీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మాన్సీ, ఆమె భర్తతో కలిసి గత రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో మల్కాజ్గిరి, నాచారం, పంజాగుట్ట, మేడ్చల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆమె డ్రగ్స్ విక్రయించినట్లు తేల్చారు. నాగ్‌పూర్‌కి చెందిన మాన్సీ భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు.
Also Read: Threat to Modi: మోదీ హత్యకు కుట్ర.. రంగంలోకి స్లీపర్ సెల్స్... ఎన్ఐఏకి అగంతకుడి మెయిల్..
Also Read: చికెన్ వివాదం... రణరంగాన్ని తలపించిన ఘటన.. యాసిడ్ దాడిలో 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook