బిచ్చగాళ్ళ జాడ చెప్పండి.. నజరానా పొందండి..!

హైదరాబాద్‌లో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.

Last Updated : Dec 15, 2017, 04:49 PM IST
బిచ్చగాళ్ళ జాడ చెప్పండి.. నజరానా పొందండి..!

హైదరాబాద్‌లో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. తమ పరిధిలో ఇప్పటికే ఈ విషయం పట్ల దృష్టి కేంద్రీకరించామని ఆయన తెలిపారు. ఇప్పటికే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పోలీసులు 300 మందికి పైగా పురుష యాచకులకు, 150 మందికి మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంటి నుండి బయటకు వచ్చేసిన వారి వివరాలు సేకరించి, వాటి కుటుంబాలకు కబురు పెట్టారు.  అలాగే ఎవరూ లేని అనాథల వివరాలు కూడా సేకరించి వారిలో కొందరిని స్థానిక ఆనంద ఆశ్రమానికి పంపించారు.

ఈ క్రమంలో మరో వినూత్న ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టారు పోలీసులు. ఈ నెల 25 వ తేది నుండి స్థానికులకు ఎక్కడైనా బిచ్చగాళ్లు కనిపిస్తే జైళ్ళ శాఖకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. అలా సమాచారం ఇచ్చేవారికి రూ.500 రూపాయలను నజరానాగా ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. సమాచారం అందించాలని భావించే పౌరులు 040-24511791, 04024527846 నెంబర్లో సంప్రదించవచ్చని జైళ్ల శాఖ డీజీ తెలియజేశారు. 

Trending News