Hyderabad Traffic Police launch Special drive from Today against Triple Riding: హైదరాబాద్ వాహనదారులు మరింత అప్రమత్తం అవ్వాల్సి ఉంది. ఎందుకంటే.. ట్రఫిక్ రూల్స్ మీరితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేటి (నవంబర్ 28) నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వారం రోజులుగా ఈ రెండు ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వలెనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. అందుకే ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే.. భారీ ఫైన్లు తప్పవని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత పక్కాగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1200 ఫైన్ వేయనున్నారు.
వాహనదారులు అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలను పక్కాగా అమలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రభుత్వ జీవో ప్రకారంమే ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తామని అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ట్రఫిక్ రూల్స్ మీరిన వాహనదారుడు పట్టుబడితే.. అతడిపై గతంలో ఏవైనా చలాన్స్ ఉన్నాయో లేదో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలు ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద పార్కింగ్ చేసిన కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.
Also Read: Cell Phone Tower: పట్టపగలే సెల్‌ఫోన్ టవర్‌ను చోరీ చేసిన దొంగలు.. ఏం కారణం చెప్పారో తెలుసా?
Also Read: 2022 IPL final: గిన్నీస్ రికార్డు సాధించిన ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.