First vaccinated Mla: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా

First vaccinated Mla: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యేగా నిలిచారు ఆయన. ఇంతకీ ఎవరాయన..

Last Updated : Jan 25, 2021, 02:09 PM IST
First vaccinated Mla: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా

First vaccinated Mla: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యేగా నిలిచారు ఆయన. ఇంతకీ ఎవరాయన..

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) ముమ్మరంగా జరుగుతోంది. తొలిదశలో కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్ల ( Frontline workers ) కు అంటే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి  వ్యాక్సిన్ ఇస్తున్నారు. తెలంగాణ ( Telangana ) లో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ సాగుతోంది. ఇవాళ్టి  నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆయా వైద్యసిబ్బందిని గుర్తించి వ్యాక్సిన్ అందిస్తున్నారు.

ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ( Jagtial mla Dr Sanjay kumar ) కరోనా వ్యాక్సిన్ తీసుకుని..వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే ( First vaccinated mla ) గా నిలిచారు. ఎందుకంటే ఇప్పటవరకూ ఎక్కడ కూడా ప్రజాతినిధులు వ్యాక్సిన్ తీసుకోలేదు. వాస్తవానికి రెండవ దశ ( Second phase vaccination ) లోనే ప్రజా ప్రతినిధులకు వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నారు. మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలా వ్యాక్సిన్ తీసుకున్నారనేదే సందేహం కదా. వృత్తిరీత్యా వైద్యుడు కావడం, కరోనా రోగులకు పెద్దఎత్తున చికిత్స అందించి ఇప్పటికే పలువురి ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ సంజయ్ కుమార్. ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్ అందించడంతో ఆ కోటాలో డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 

జగిత్యాలలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ( Vaccination for private medical staff ) ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాను కూడా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సిన్ వేశారు. ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వ్యాక్సిన్ అందుతుందని చెప్పారు సంజయ్ కుమార్. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహాయించి రోజూ ఉదయం 10 గంటల్నించి మధ్యాహ్నం 3 గంటల వరకూ టీకా కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రెండవదశలో మాత్రం దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిదులంతా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. 

Also read: Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త, ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News