Komatireddy venkat reddy announces 25 lakh for Revathi family: పుష్ప2 విడుదల నేపథ్యంలో జరిగిన తొక్కిసలట ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు.. అల్లు అర్జున్ రాకుండా.. ఈ ఘటన జరక్కపోయేదన్నారు. ఒక నిండు ప్రాణం పోవడానికి, మరో ప్రాణం వెంటిలెటర్ మీద ఉండేందుకు.. అల్లు అర్జున్ కారణమని అన్నారు.
అదే విధంగా ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. రేవతి చనిపోతే.. కనీసం ఒక్కరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. అంతే కాకుండా.. దీనిపై లేనీ పోనీ రాద్ధాంతం చేశారన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కు కాళ్లు విరిగాయా.. చేతులు విరిగాయా.. సినిమా ఇండస్ట్రీ అంతా పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్లి రాద్దాంతం చేశారన్నారు.
ఈ ఘటనపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. సినిమాటో గ్రఫి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఘటనపై తనదైన విధంగా స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈక్రమంలో తాను వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్ధికసాయం అందిస్తున్నామన్నారు. అదే విధంగా కిమ్స్ లో అయ్యే వైద్య ఖర్చులను రేవంత్ సర్కారు భరిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బాలుడి ఆరోగ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని కూడా కోమటి రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter