Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే శుక్రవారం నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చిన నేపథ్యంలో తొలిరోజు కాంగ్రెస్ కీలక నేతలతో కలిసి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మానిక్ రావు ఠాక్రేకు, తనకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు మీడియాకు వెల్లడించారు. కొత్త ఇంఛార్జి మానిక్ రావు థాక్రే ఆహ్వానం మేరకే తాను గాంధీ భవన్ కి వచ్చి కలిశాను అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ముందున్న సవాళ్లను వివరించాను అని అన్నారు. రాష్ట్రంలో పార్టీ విజయం కోసం అవలంభించాల్సిన విధానాలను తెలిపాను అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సందర్భమే వస్తే ఆ ఛాలెంజ్ ని ఎదుర్కునేలా కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయాలని చేయాలని అన్నాను. అందుకోసం కనీసం ఒక 50 నుంచి 60 మంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలి. అలా కాకుండా ఎన్నికలకు సరిగ్గా ఒక వారం లేదా పది రోజుల ముందు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టంచేశాను.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేవలం గాంధీ భవన్లో మీటింగ్స్ పెట్టుకోవడంతో లాభం లేదు. గాంధీ భవన్లో మీటింగ్స్ తగ్గించి రాబోయే 6 నెలలు ప్రజల మధ్యే ఉంటూ ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుచేశాను అని అన్నారు. ఇంఛార్జి మానిక్ రావు థాక్రే సైతం జిల్లాల్లో మీటింగ్స్ పెట్టి విస్తృత పర్యటనలు చేస్తేనే ఫలితం ఉంటుందని సూచించాను. తన అభిప్రాయాలతో మానిక్ రావు థాక్రే సైతం సానుకూలంగా స్పందించారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Allu Arjun At Vizag Airport: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్కమ్
ఇది కూడా చదవండి : Mammootty in PSPK Film: పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్ముట్టికి విలన్ పాత్ర.. ఏమైందో తెలుసా ?
ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook