KTR Offer To Revanth Reddy: ఫార్ములా ఈ కారు రేసు కేసులో అణాపైసా కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. తాను అవినీతికి పాల్పడలేదని.. తప్పు చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. ఈడీ విచారణకు తాను సంపూర్ణంగా సహకరించానని.. ఎన్నిసార్లు పిలిచినా తాను తప్పక వెళ్తానని.. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు జైలుకు వెళ్లడంతో తనను కూడా జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: TPCC Women Wing: రేవంత్ రెడ్డికి మహిళల బిగ్ షాక్.. పదవుల కోసం గాంధీ భవన్ వేదికగా వార్నింగ్
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో గురువారం ఏడు గంటలపాటు విచారణ ఎదుర్కొన్న అనంతరం కేటీఆర్ విడుదలయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతి చేయలేదని మరోమారు స్పష్టం చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. నిజాయితీ ఉంటే లై డిటెక్టర్‌కి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేశారు.
Also Read: Himanshu Rao KCR: మనవడికి వ్యవసాయం నేర్పుతున్న మాజీ సీఎం కేసీఆర్ తాతయ్య
'రేవంత్ రెడ్డి చెప్పిన ప్లేస్‌కి నేనైనా వస్తా. లేదా కోర్టు ముందుకైనా వస్తా. చిత్తశుద్ది ఉంటే సిద్దంగా ఉండు. తప్పు ఎవరు చేశారో బయటపడుతుంది. నీ మీద ఈడీ కేసు ఉంది. నాపై ఈడీ కేసు పెట్టించావు. నీపై ఏసీబీ కేసు ఉంది. నామీద ఏసీబీతో కేసు పెట్టించావు' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. న్యాయస్థానం.. న్యాయమూర్తులపై నమ్మకం ఉందని.. న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ప్రకటించారు. 'తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం' అని కేటీఆర్ తెలిపారు.
రేవంత్‌కు ఎదురుదెబ్బ
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇరికించాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయని తాజాగా కేటీఆర్ ఈడీ విచారణ అనంతరం విడుదల కావడం ఉదాహరణగా నిలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఏసీబీ, ఈడీ వలన కుదరలేదని తెలుస్తోంది. ఫార్ములా ఈ కారు రేసులో నిధుల మళ్లింపు జరిగినా ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఏసీబీ, ఈడీలు అరెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డికి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగులుతోందని చర్చ జరుగుతోంది.
I am challenging Revanth Reddy today.
Let us both sit for a lie detector test in front of a judge or in your Jubilee Hills palace.
Let Telangana decide who is speaking the truth and who is lying!
- BRS Working President @KTRBRS pic.twitter.com/GKiCBchDRo
— KTR News (@KTR_News) January 16, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.