Komatireddy Venkat Reddy: కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు.. తలకాయ పగిలి పోతది: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy on KTR: కేటీఆర్, హరీష్‌ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మామ చాటు అల్లుడు.. హరీష్ రావు, తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. తాను తిడితే వాళ్ల తలకాయ పగిలిపోతాదని వార్నింగ్ ఇచ్చారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 29, 2025, 06:22 PM IST
Komatireddy Venkat Reddy: కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు.. తలకాయ పగిలి పోతది: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy on KTR: కేటీఆర్ విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. పనికి రాని మాటల గురించి మాట్లాడితే టైం వెస్ట్ అని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడికి వచ్చి అయినా.. వాళ్ల సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని.. బండి సంజయ్ ఉన్నడా..? అని నిలదీశారు. అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి.. ఉద్యమం చేశారని.. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్‌లో పల్లి గింజలు, ఐస్ క్రీమ్‌లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు.  ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు.. ఈ మొకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించిండు.. పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే.. అధికారం పోగానే నీతులు చెప్తున్నారు.. కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు.. కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రివి అయ్యావు.. నీతి నిజాయితీకి మారు పేరు వెంకట్ రెడ్డి. నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా..? ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు..? మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు.. ఇక్కడ మూసీ చేయొద్దట.. అక్కడ యమున చేస్తారట.. మూసీ క్లీన్ చేస్తామంటే.. అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్‌లలో పడుకున్నారు.. 

నాపై మాట్లాడానికి కేటీఆర్‌కి నైతిక హక్కు లేదు. కేటీఆర్ బచ్చ.. వాళ్ల దగ్గర ఏముంది.. లక్షల కోట్లు.. ఈ కార్ రేస్.. అవినీతి తప్ప. నాకు లక్షల కోట్లు లేవు.. ప్రజల అండ దండలు ఉన్నాయి. అమెరికాలో చదువుకుని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు.. నేను తిడితే వాళ్ల తలకాయ పగిలి పోతది. జైలుకి పోయిన లాలు ప్రసాద్ నయ్యం.. కేసీఆర్ జైలుకి పోకుండానే.. ఒక్కసారి అసెంబ్లీకి రాలేదు. మామ చాటు అల్లుడు.. హరీష్ రావు.. తండ్రి చాటు కొడుకు కేటీఆర్.." అని కోమటిరెడ్డి అన్నారు. 

బుధవారం గాంధీభవన్‌లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్ బాధితులు.. అక్షర చిట్ ఫండ్ ఎండీ పేరాల శ్రీనివాస్ రావు చేసిన మోసాన్ని మంత్రి కోమటిరెడ్డి  దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని భాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పేదల సొమ్మును కొలగొట్టిన పేరాల శ్రీనివాస్‌పై విచారణ చేసిన ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పేదలు సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు.

Also Read: Tirumala: తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Also Read: SBI Har Ghar Lakh path: 3ఏళ్లలో 5 లక్షలు సంపాదించే ట్రిక్‌.. ఏం చేయవద్దు.. కానీ ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News