Moving car catches fire in Secunderabad: సికింద్రాబాద్‌లోని (Secunderabad) పరేడ్ మైదానం ఫ్లైఓవర్‌పై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కదులుతున్న కారులో మంటలు చెలరేగగా డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కిందకు దిగాడు. చూస్తుండగానే క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును ఫ్లైఓవర్ పైనుంచి తొలగించారు. దీంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ క్లియర్ అయింది. మొదట కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగి (Car catches fire)... ఆపై కారు మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద కారణాలపై పోలీసులు డ్రైవర్‌ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలోనూ హైదరాబాద్‌లోని పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
రెండు నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer ring road) ఇలాంటి ప్రమాద ఘటనే చోటు చేసుకుంది. శంషాబాద్ (Shamshabad) పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. డ్రైవర్ మంటలను గమనించినప్పటికీ... కారును రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నించగా... ఈలోపే మంటలకు ఆహుతైపోయాడు. గచ్చిబౌలి (Hyderabad) నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: Revanth Reddy:కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనకూడదా-కేసీఆర్‌ను నిలదీసిన రేవంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook