Padi Kaushik reddy arrested in Hyderabad: పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కరీంనగర్ లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మండిపడ్డారు. నువ్వు ఏ పార్టీ అంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. బోసిడీకే.. మొగొనివైతే.. రాజీనామా చేసి గెలవాలని కూడా సవాల్ విసిరారు.ఈ క్రమంలో కరీంనగర్ లో గొడవ పెద్దదిగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి.
10టీవీ ఆఫీస్ దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
అరెస్ట్ చేసిన కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు https://t.co/tDB6cztQBc pic.twitter.com/5Xezi2TLTi
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
అదే విధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం.. అసెంబ్లీ స్పీకర్ కు ఘటనపై ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకొవాలన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ కేసుల్ని కుట్రపూరీతంగా పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపణలు చేశాయి. మరొవైపు .. ప్రశ్నిస్తే.. తమపైకేసులు పెడుతున్నారంటూ కూడా.. బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
అయితే... ఇప్పటికే ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలుసీరియస్ అయ్యారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ వాళ్లని కంట్రోల్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి జరిగితే.. తాము కూడా పార్టీ ఆఫీసులకు వచ్చి కొడతామని కూడా హెచ్చరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.
మరోవైపు తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఇటీవల హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు.. 35 మంది స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి.. పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహానంలో ఎక్కించారు. దీనిపై ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా మండిపడున్నాయి. ఇలాంటి కేసులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని.. రేవంత్ ను మాత్రం వదిలేదని లేదని ఇప్పటికే కేటీఆర్ పలు మార్లు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter