IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో పోలీసుల లాఠీఛార్జ్‌..పలువురికి గాయాలు..!

IND vs AUS: హైదరాబాద్‌లో క్రికెట్ టికెట్ల రచ్చ కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉద్రిక్తత నెలకొంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 22, 2022, 01:33 PM IST
  • హైదరాబాద్‌లో క్రికెట్ టికెట్ల రచ్చ
  • సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉద్రిక్తత
  • పలువురికి గాయాలు
IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో పోలీసుల లాఠీఛార్జ్‌..పలువురికి గాయాలు..!

IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో గందరగోళం నెలకొంది. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈక్రమంలోనే టికెట్ల విక్రయాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఆధార్ చూపించిన వారికి తల రెండు టికెట్లు ఇస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.

దీంతో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. టికెట్లను తీసుకునేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈసందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో ఒకరు మృతి చెందగా..పలువురికి గాయాలు అయ్యాయి. ఒక్కానొక సమయంలో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. 

మరోవైపు టికెట్ల విక్రయాల్లో ఆలస్యం జరుగుతోంది. సాంకేతిక లోపంతో ఆన్‌లైన్ పేమెంట్లు జరగడం లేదు. దీంతో నగదు ఉంటేనే టికెట్లు ఇస్తున్నారు. ప్రణాళిక లేకుండా టికెట్లను అమ్మడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అభిమానులు మండిపడుతున్నారు. పాస్‌ల జారీలో సరైన పద్ధతి లేదంటున్నారు. 

 

Also read:Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి..? తాజా కేసులు ఎన్నంటే..!

Also read:IND vs AUS: అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టబోం..స్టార్ ప్లేయర్‌పై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News