తెలంగాణా వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. విభజన జరిగిన నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హైకోర్టు ఫలం అందింది. కేంద్ర ప్రభుత్వం కనికరించడంతో ఇది సాధ్యపడింది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త ఏడాది నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు న్యాయవాదుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో సహా పలువురు ప్రముఖలు హాజరయ్యారు. హైకోర్టు ఆవరణలో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం జరిగింది. కాగా హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో ఇక నుంచి హైదారాబాద్ లో హైకోర్టు భవనంలో తెలంగాణ హైకోర్టు కార్యకలాపాలు మాత్రమే జరుగుతాయి.ఇక నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలు అమరావతిలో జరుగుతాయి