Saroor Nagar Honour Killing Case : రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నాగరాజును అశ్రిన్ సుల్తానా సోదరుడు హత్య చేసినట్లు వెల్లడైంది. అశ్రిన్-నాగరాజు ఆచూకీ ఎలా కనుగొన్నారు... వారి కదలికలపై ఎలా నిఘా పెట్టారు... అసలు హత్యకు దారితీసిన పరిస్థితులేంటి అన్న వివరాలు రిమాండ్ రిపోర్టులో వెల్లడయ్యాయి.
హత్యకు దారితీసిన పరిస్థితులు :
అశ్రిన్ సోదరుడు మోబిన్ అహ్మద్ తండ్రి మరణం తర్వాత తానే కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు. తల్లి, ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడిని పోషించేందుకు పండ్ల వ్యాపారం చేసేవాడు. గతేడాది రెండో సోదరికి హైదరాబాద్ లింగంపల్లికి చెందిన అహ్మద్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. మూడో సోదరి అశ్రిన్ సుల్తానాకు ఈ ఏడాది జనవరిలో ఒక సంబంధం తీసుకొచ్చాడు. భార్య మరణించి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. సుల్తానా ఆ సంబంధం తిరస్కరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అతన్ని చేసుకునేది లేదని సుల్తానా తెగేసి చెప్పింది. సోదరుడు ఎక్కడ బలవంతంగా వివాహం చేస్తాడేమోనన్న భయంతో ఈ ఏడాది జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు చేరింది.
నాగరాజు-సుల్తానా ఆచూకీ ఎలా తెలిసిందంటే :
ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోని పాతబస్తీ ఆర్య సమాజ్‌లో నాగరాజు-సుల్తానా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చాక సుల్తానా లింగంపల్లిలోని తన సోదరితో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో వారు ఎక్కడ ఉంటున్నది సుల్తానా సోదరికి తెలిసింది. ఈ విషయం భర్తకు చెప్పడంతో... అతను బావమరిది మోబిన్ అహ్మద్‌కు సుల్తానా ఆచూకీ చెప్పాడు. టెక్నాలజీ సాయంతో నాగరాజు మొబైల్‌లో స్పై వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి... వారి ప్రతీ కదలికపై నిఘా పెట్టాడు. ఈ క్రమంలో మార్చిలోనే నాగరాజు హత్యకు ప్లాన్ వేశాడు. అయితే రంజాన్ మాసం కావడంతో హత్య వాయిదా వేశాడు. రంజాన్ ముగిసిన మరుసటిరోజే నాగరాజును దారుణంగా హతమార్చాడు.
Also Read:Horoscope Today May 9 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook