Saroornagar Kidnap Case: సరూర్ నగర్‌లో యువకుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. బీజేపీ కార్పోరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని ఈ కిడ్నాప్ వెనక ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సహా 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. కిడ్నాపైన యువకుడు కూడా బీజేపీ నేత కుమారుడే కావడం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పోరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి, సరూర్‌నగర్‌కి చెందిన లక్ష్మీ నారాయణకు మధ్య కొన్నాళ్లుగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. శ్రవణ్ అనే మరో బీజేపీ కార్యకర్త కూడా లక్ష్మీ నారాయణపై ఆగ్రహంతో ఉన్నాడు. తమకు బంధువయ్యే ఓ మహిళతో లక్ష్మీ నారాయణ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో ఆయనపై కోపం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో కార్పోరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కార్యకర్త శ్రవణ్ కలిసి లక్ష్మీ నారాయణ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. లక్ష్మీ నారాయణతో ఆస్తి విషయంలో గొడవపడుతున్న అతని సోదరుడు మురళి కూడా ఈ కిడ్నాప్ ప్లాన్‌లో భాగస్వామి అయ్యాడు. ఈ ముగ్గురు కలిసి కిడ్నాప్ కోసం సెక్రటేరియట్‌లో పనిచేసే పునీత్ తివారీ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సంప్రదించారు. పునీత్ తివారీ ఈ కిడ్నాప్ కోసం 11 మంది యువకులను రంగంలోకి దింపాడు.
గత గురువారం (సెప్టెంబర్ 1) అర్ధరాత్రి సమయంలో ఆ యువకులు 2 కార్లలో లక్ష్మీ నారాయణ ఇంటి వద్దకు వెళ్లారు. లక్ష్మీ నారాయణ ఇంటికి సమీపంలోని గణేశ్ మండపం వద్ద అతని రెండో కుమారుడు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. నిద్రిస్తున్న అతన్ని కారులో కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా చింతపల్లికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే లక్ష్మీనారాయణ తమ అబ్బాయి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చింతపల్లి వద్ద కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగస్వాములైన శ్రవణ్, మురళిలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
లక్ష్మీ నారాయణ కొడుకుని కిడ్నాపర్లు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. కారులో తనను తీవ్రంగా కొట్టి సిగరెట్లతో కాల్చారని బాధిత యువకుడు తెలిపాడు. అంతేకాదు, ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి బలివ్వబోతున్నామని బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Jana Gana Mana Shelved: లైగర్ డిజాస్టర్ రెస్పాన్స్.. 'జనగణమన'కు మంగళం
Also Read: ఇక నేను రంగంలోకి దిగుతున్నా.. బీజేపీ 50 సీట్లకు పడిపోవడం ఖాయం.. నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook