Taslima Mohammed bribe case ACB Finds Crores Worth Assets: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ మహబూబాద్ లో సబ్ రిజిస్ట్రర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతనెలలో ఆమె తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ, ఏసీబీకీ అడ్డంగా దొరికిపోయారు. ఈక్రమంలో ఆమెపై ఏసీబీ అధికారులు కేసునమోదు చేశారు. అదేవిధంగా ఆమె ఎక్కడెక్కడ పనిచేసిందో, ఎక్కడ అక్రమ ఆస్తులు కూడగట్టిందో దీనిపై విచారణ చేపట్టారు. నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు షాక్ కు గురయ్యే, ప్రాపర్టీలు, బంగారం, నగదు మొదలైనవి దొరికాయి. ఆమె పేరుపైన 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు ఈ ప్రాపర్టీలను చూసి షాక్ నకు గురౌతున్నారంట.
ప్రస్తుతం తస్లీమా నస్రీన్ సస్పెండ్ లో ఉన్నారు. తస్లీమా ఆస్తుల విలువు దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2.94 కోట్లు ఉందని తెలుస్తోంది. కానీ మార్కెట్ విలువ ప్రకారం మాత్రం.. రూ. 10 కోట్లకు మంచి ఉంటుందని ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా తస్లీమా మహమ్మద్ ప్రతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, సర్వర్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంతో మందికి తనవంతుగా సహాయం చేసినట్లు బిల్డప్ ఇచ్చేవారు.
అంతే కాకుండా ప్రతి ఆదివారం నాడు.. వ్యవసాయ పనుల కోసం కూలీలకు కూడా వెళ్లేది. ఆమె వీడియోలు, ఫోటోలు, కథనాలు సోషల్ మీడియాలలో ట్రెండింగ్ లో ఉండేవి. ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం ఏసీబీకి దొరికిపోవడం తీవ్ర సంచనలంగా మారింది. ముఖ్యంగా మంత్రి సీతక్కతో ఆమెకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్తుంటారు. తస్లీమా,సీతక్కను కలుసుకున్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో అపోసిషన్ లీడర్లు.. మంత్రి సీతక్కపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..
కానీ తస్లీమాను ఫాలో అయ్యే కొందరు మాత్రం.. గ్రూప్ 1 క్యాడర్ లో ఉండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకుని, ఇలాంటి పనులు ఎందుకు చేసిందో అంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు కావాలనే తస్లీమాను ఈకేసులో ఇరికించారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. తస్లీమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సదరు అధికారిణి ఇలాంటి పనులుచేయడం పట్ల అందరు ఆశ్చర్యపోతున్నారు. సదరు సబ్ రిజిస్ట్రార్ ఇటీవల ఎక్కడెక్కడ పనిచేసింది. ఆమె అక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై ఏసీబీ సమగ్రంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఏది ఏమైన దీనిపై పూర్తి వివరాలు బైటకు రావడానికి మరికొన్నిరోజులు మాత్రం వేచిచూడాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter