Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీజేపీ ఎల్పీ నేత ఎవరో?

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది.

Written by - Srisailam | Last Updated : Sep 5, 2022, 11:39 AM IST
  • మంగళవారం నుంచి అసెంబ్లీ
  • కీలక తీర్మాణాలు చేసే ఛాన్స్
  • బీజేపీఎల్పీ పై రాని క్లారిటీ
Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీజేపీ ఎల్పీ నేత ఎవరో?

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది. ఈ సారి సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారన్నది ఇంకా క్లారిటీ లేదు. స్పీకర్ అధ్యక్షతన జరగనున్న బీఏసీ భేటీలో అసెంబ్లీని ఎన్ని రోజులు జరపాలన్నది నిర్ణయించనున్నారు. తొలి రోజు సమావేశం తర్వాత ఉభయసభలు ఈనెల 13కు వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. ఈనెల 6, 13. 14 తేదీల్లో అసెంబ్లీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీరుకు నిరసనగా అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మాణాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎఫ్ఆర్బీఎం, కేంద్ర సర్కార్ ఆర్థిక ఆంక్షలు, విద్యుత్ బకాయిల విషయంలో ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం, ఉచిత పథకాలు వంటి అంశాలపై తీర్మానాలు కేంద్రానికి పంపనున్నారని సమాచారం. గోదావరి వరదలు, కేంద్ర సాయంపై అసంతృప్తిగా ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి ప్రకటన చేయవచ్చని అంటున్నారు. విభజన చట్టంలో ఉన్నా వెనకబడిన జిల్లాలకు మూడేండ్లుగా ఆర్థికసాయం చేయకపోవడంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని అంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తున్న కేసీఆర్... దీనిపైనా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయవచ్చని తెలుస్తోంది. సెప్టెంబరు 17 సందర్భంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలపైనా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈసారి అసెంబ్లీలో గతానికి భిన్నంగా కీలక ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు.

మరోవైపు అసెంబ్లీలో బీజేపీ శాసనసక్ష పక్ష నేతగా ఎవరు ఉంటారనే ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒక్క రాజాసింగ్ గెలిచారు. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలిచారు. అసెంబ్లీలో బీజేపీ బలం రెండుకు పెరగగా.. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజాసింగ్ వ్యవహరించారు. గత ఏడాది జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలవడంతో అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ట్రిపుల్ ఆర్ లు వచ్చాకా కూడా రాజాసింగే బీజేఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదస్పదమైంది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. వీడియో వివాదం తర్వాత రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించిన తెలంగాణ పోలీసులు.. చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో మంగళవారం నుంచి జరగనున్న అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఈటల రాజేందర్ కు ఇస్తారా లేక రఘునందన్ రావుకు అప్పగిస్తారా అన్నది తేలలేదు. రాజాసింగ్ ను సస్పెండ్ మాత్రమే చేశారని.. బహిష్కరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేఎల్పీ పగ్గాలు కొత్తవారికి ఇచ్చే అవకాశం లేదంటున్నారు.

Read Also: Bengaluru Traffic: బెంగళూరు ఐటీ సంస్ఠలకు ట్రాఫిక్ గండం.. ఒక్క రోజే 225 కోట్ల నష్టం  

Read Also: Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News