Telangana Assembly Monsoon Sessions 2021 KCR gives clarity on diversion of funds of panchayats: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Sessions) శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (speaker pocharam srinivas reddy) సభను ప్రారంభించిన వెంటనే ప్రశ్నోత్తరాలు జరిగాయి. గ్రామపంచాయతీ నిధులపై ( funds of panchayats) ప్రశ్నోత్తరాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడారు. తెలంగాణ పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని గ్రామాలను (Telangana VIllages) చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు సీఎం. పంచాయతీ గ్రాంట్‌లు ఆపొద్దని చాలాసార్లు తాను చెప్పానని గుర్తు చేశారు కేసీఆర్. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో ప్రతిపక్షాలకు (opposition parties) తెలియదా అని ప్రశ్నించారు.
నిధుల మళ్లింపు అనేది పూర్తిగా అవాస్తవం
కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ పంచాయతీలకు నిధులు ఆపలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో పంచాయతీల నిధుల మళ్లింపు (diversion of funds) అనేది పూర్తిగా అవాస్తవం అని, ఇది సత్యదూరమని కేసీఆర్ వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ సర్పంచులు గర్వంగా తలెత్తుకునేలా చేశామన్నారు కేసీఆర్. తెలంగాణ సర్పంచ్‌లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారని గుర్తు చేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్ (NITI Aayog) కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చారన్నారు. ముఖ్రా కే (Mukhra (K) village) గ్రామానికి అవార్డు వచ్చిందని గుర్తు చేశారు.
Also Read : Kondapolam movie: కొండ పొలం మూవీకి Censor పూర్తి
టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.650 ఖర్చు చేస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఒక వ్యక్తిపై సగటును రూ.4 ఖర్చు చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.650 ఖర్చు చేస్తోందని చెప్పారు. శాసనసభలో అడ్డగోలుగా మాట్లాడితే సరికాదని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (congress government) సర్పంచ్‌లు బాధపడిన మాట వాస్తవమని.. ఇప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు సీఎం కేసీఆర్.
ఎవరి గొంతు నొక్కడం లేదు
ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారంటూ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాము ఎవరి గొంతు నొక్కడం లేదన్నారు. సభలో బ్రహ్మాండంగా.. అద్భుతంగా మాట్లాడండి.. మేం మీకంటే అద్భుతంగా మాట్లాడతాం అని అన్నారు కేసీఆర్ (KCR). అలాగే మనకంటే అద్భుతంగా ప్రజలు గమనిస్తారు అని చెప్పారు.
Live: CM Sri KCR speaking in Legislative Assembly https://t.co/LZHGtdqHcO
— Telangana CMO (@TelanganaCMO) October 1, 2021
Also Read : Funny Dance Video:ఆఫ్రికన్ వధువు-ఇండియన్ వరుడు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook