Bandi Sanjay Slams CM KCR: తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన అధికారం కోసం తన కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. చివరకు తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తుందని సిగ్గులేకుండా చెబుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌నే ఎవడూ దేఖడం లేదని.. ఇగ ఆయన బిడ్డను పట్టించుకునేదెవడు..? అంటూ ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నాడని అన్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎందుకు బయటకు రావడం లేదో.. గంప కింద ఎందుకు కమ్మి పెట్టిండో అర్ధం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. సీఎంకు దమ్ముంటే దక్కన్ కిచెన్ హోటల్, ఫాంహౌజ్, ప్రగతి భవన్‌లోని సీసీ పుటేజీలను సేకరించి విచారణ జరపాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సిద్దంగా ఉన్నామన్నారు.
'నాకు జైళ్లు కొత్త కాదు.. కేసులు కొత్త కాదు.. కొప్పుల ఈశ్వర్ కు కొంచెమైనా ఉండాలే.. ప్రెస్ మీట్‌లో కూర్చోనీయకుండా పక్కకు తోసిన కేసీఆర్‌ను పొగుడుతున్నడు.. నిన్నటి సమావేశ ఉద్దేశమేంది..? ఆ సమావేశంలో ఉద్దరించిందేమిటి..? ఆ సమావేశంలో కేసీఆర్ భయపడుతున్నడు.. మమ్మల్ని భయపెడుతున్నారని ఎమ్మెల్యేలే నవ్వుకుంటున్నరు. తెలంగాణలోనే కేసీఆర్‌కు దిక్కు దివాణ లేదు.. మునుగోడులోనే 100 మంది ఎమ్మెల్యేలను మోహరించిండు.. ఇగ దేశం అంతా ఎట్లా పోటీ చేస్తడు.. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నియామకాల్లేవు. బూత్ కమిటీల్లేవు. ఇగ దేశం మీదకు ఎట్లా పోతడు..?
మంత్రులు, ఎమ్మెల్యేలకు బుద్ది లేదు.. కేసీఆర్‌కు ఆలోచనే లేదు. ధరణి సమస్యలతో జనం అల్లాడుతుంటే ప్రశ్నించే దమ్ములేని నాయకులు. ఎందుకు ప్రశ్నించడం లేదు..? కష్టపడి గెలిపించిన ప్రజలకు రేపు ఏం సమాధానం చెబుతరు..? గొర్రెల్లెక్క తలూపుకుంటూ వస్తారా..? అని జనం నిలదీసే రోజులు వస్తున్నయ్. యాడ చూసినా భూకబ్జాలే.. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఏడుకొండలు నల్లగొండలో రైలు కింద పడి చనిపోయిండు..' అని బండి సంజయ్ అన్నారు.
అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిక అంశం తనకు తెలియదని ఆయన అన్నారు. వాళ్లు సొంత పనిమీద పోతే.. దానికి పార్టీకి లింక్ పెడుతూ రాస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లకు, మీడియా సమన్వయం లేదేమో... బీజేపీ ఎవరో రావాలి.. ఎవరినో చేర్చుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. కార్యకర్తలే తమ బలం అన్నారు.
Also Read: Babar Azam: టీ20 ప్రపంచ కప్‌లో పాక్ ఓటమి.. బాబర్ ఆజామ్ సోదరుడికి నోటీసులు
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు.. భారీగా పెరగనున్న జీతాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి