Bandi Sanjay Speech At Vijay Sankalp Sabha: వేట మొదలైంది.. వేటాడానికే పులి వచ్చిందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కార్యకర్తలను కాపాడే పులి అని.. ఆ పులే చేవెళ్ల గడ్డపై అడుగుపెట్టిందన్నారు. బీజేపీ నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు తిప్పారని అన్నారు. అప్పుడు తాను కార్యకర్తలకు భయపడకండని చెప్పానని.. ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందనని అన్నారు. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో తనను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కరీంనగర్ దాటిన తరువాత తన భార్య ఫోన్ చేసి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పిందన్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే.. కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని.. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లను నిర్మిస్తామని.. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. లాఠీ దెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదనిక స్పష్టంచేశారు.
అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ.. బండి సంజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోరాట యోధుడిగా అభివర్ణించారు. బండి సంజయ్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అమిత్ షా బీజేపీ కార్యకర్తలు అరెస్టులు, జైళ్లకు భయపడబోరని స్పష్టం చేస్తూనే.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని సంకేతాలు పంపారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి అమిత్ షా గట్టి హెచ్చరికలు పంపారు. అమిత్ షా ప్రసంగం ముగిసిన అనంతరం చేవెళ్ల బహిరంగ సభను విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను బండి సంజయ్ పరిచయం చేసి శాలువా అందించారు. చంద్రశేఖర్‌ను అభినందిస్తూ శాలువాతో సన్మానిస్తూ చేయిపట్టి పైకెత్తి విజయ సంకేతం చూపారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పక్కనే ఉన్న మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పరిచయం చేశారు.
Also Read: Amit Shah Speech: సౌండ్ ప్రధాని మోదీకి వినపడాలి.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా
అంతకుముందు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు అమిత్ షా. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. కేసీఆర్ సీఎం కూర్చిని కాపాడుకోవాలన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ముస్లి రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కావాలా..? వద్దా..? అని బీజేపీ కార్యకర్తలను అడిగారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా అవినీతి పాలన కొనసాగుతోందని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: KTR Satires On BJP: అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి