Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. శాసనసభ పూర్తి అప్రజాస్వామికంగా..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ, స్పీకర్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి శ్రీధర్ బాబులు మండిపడుతున్నారు. సభ మొత్తం అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా స్పీకర్ పట్టించుకోవకపోవడం శోచనీయమన్నారు. ఇదసలు చట్ట సభా లేదా టీఆర్ఎస్ కార్యాలయమా అర్ధం కావడం లేదన్నారు. సభులో సభ్యుల్ని అవమానపరుస్తున్నారని..సభా హక్కుల్ని తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. సభ నిర్వహణ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు.
మరోవైపు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు స్పీకర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ ప్రసంగం ఉందని..అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంశం అడిగామన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సభలో సభ్యుల హక్కుల్ని కాపాడటం లేదన్నారు. ఇక మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు, స్పీకర్‌పై విమర్శలు గుప్పించారు. స్పీకర్ పోచారం వ్యవహారం సరిగ్గా లేదని విమర్శించారు.కేసీఆర్ వ్యవహారశైలి ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రౌడీలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరిచారని మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదని..తెలంగాణ ప్రజలకు అవమానమని చెప్పారు.కేసీఆర్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని మరోసారి అర్ధమైందన్నారు. వేయిమంది బలిదానాల ఫలితమైన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబపరమైందని చెప్పారు.
Also read: Singareni Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook