హైదరాబాద్: కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం 6 మందికి పాజిటీవ్‌గా తేలగా మొత్తం కేసుల సంఖ్య 76కు చేరుకుంది. మరోవైపు మరణాల సంఖ్య ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు సంభవించగా.. కరోనాతో తెలంగాణలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
తెలంగాణలో వేతనాల కోత విధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం వెల్లడించారు. కరోనా మహమ్మారితో పోరాటంలో భాగంగా నిధుల కొరత, పనులు ఎక్కడిక్కడ ఆగిపోవడం లాంటి విషయాలపై అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై Coronavirus వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప సీఎం శ్రీ కేసీఆర్ వివిధ రకాల వేతనాల చెల్లింపులలో కోత విధించాలని నిర్ణయించారు. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో మార్చి నెల నుంచి కోత పడనుందని జీవో విడుదల చేశారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
వేతనాల కోతల వివరాలు: ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు - 75%, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు - 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు - 50%, రిటైర్డ్ ఉద్యోగులు - 50% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నాల్గవ తరగతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాలలో 10% కోత ఉంటుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. వేతనాలలో ఈ కోత మార్చ్ నెల నుండి అమల్లోకి వస్తుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత.. మార్చి నుంచే అమలు