Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. ఈనెల 28న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని తెలిపింది. జూన్ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ముల్యాంకనం పూర్తై..మార్కులు ఖరారు అయిన ఫలితాల్లో జాప్యం జరిగింది.
అప్లోడింగ్తోనే ఫలితాలు ఆలస్యమయ్యిందని అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కగా రిజల్ట్ ఇస్తున్నామన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యాయని..ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెలాఖరులోపు ఫలితాలు విడుదల అవుతాయని ఇదివరకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also read: T-Hub 2.0 at Hyd: తెలంగాణలో అందుబాటులోకి మరో మణిహారం..ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!
Also read: Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి